అమ్మ నీ రుణం తీర్చుకోలేనిది
కల్మషం లేని ప్రేమను అందించడమే అమ్మకు తెలుసు తన పిల్లల బంగారు భవిష్యత్ కొరకు తపన పడుతుంది. కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కష్టపడుతుంది అమ్మ...
తాను పస్తులు ఉండి తన బిడ్డల కడుపు నింపి సంతోషపడుతుంది కుటుంబం తన పిల్లల కోసం కొవ్వొత్తిలా కరిగిపోతుంది అమ్మ అలసిపోయిన తన శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వడానికి కూడా ఆలోచిస్తుంది అమ్మ....
చెట్టులా నీడనిచ్చి కుటుంబానికి సంతోషాన్నిస్తుంది తన పిలలు గుర్తించినా గుర్తించకపోయినా గుండెల్లో పెట్టుకొని వారి పట్ల ప్రేమను చూపుతోంది ఆట పాటలతో ఆనంద పరుస్తుంది.
ఈ సృష్టిలో ఏ స్వార్థం లేని మహోన్నతమైన గొప్ప వ్యక్తిత్వం ఉన్న ప్రేమమూర్తి అమ్మ జన్మజన్మలకు తీర్చుకోలేము నీ రుణం ప్రాణం ఉన్నంత వరకు నీ సేవకై మేము సిద్ధం అమ్మ....
సిరాచుక్క
Tags
News@jcl