అదానీ-హిండెన్ బర్గ్ వివాదంలో..కోటక్ మహీంద్రా బ్యాంక్ ట్విస్ట్

Caption of Image.

అదానీ- హిండెన్ బర్గ్ వివాదంలో మరో ట్విస్ట్.. ఈ వ్యవహారంలో హెండెన్ బర్గ్ కు ఇండియన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ ఆప్ ఇండియా (సెబీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భారత మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుండి షోకాజ్ నోటీసు అందుకున్నట్లు ధృవీకరంచారు. ఈ క్రమంలో కోటక్ బ్యాంక్ ను కూడా ఈ వివాదంలోకి లాగబడింది. 

అదానీ గ్రూప్ పై తమ నివేదికలో ఆరోపించిన ఫ్రాడ్ ను పరిష్కిరించడంలో ఇండియన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ ఆప్ ఇండియా (సెబీ) విఫలమైందని హిండెన్ బర్గ్ చేసిన వ్యాఖ్యలకు సెబీ షోకాజ్ నోటీసులిచ్చింది. ఈ విషయాన్ని సోమవారం ( జూన్ 1) న హెండెన్ బర్గ్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే దీనిపై స్పందిస్తూ పలు కీలక విషయాలను బయటపెట్టారు హిండెన్ బర్గ్.  

హిండెన్ బర్గ్ మాట్లాడుతూ..’’బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ బ్యాంక్‌ని స్థాపించారని అలాగే బ్రోకరేజీని సృష్టించి..పేరు తెలియని పెట్టుబడిదారుడు ఉపయోగించిన ఆఫ్‌షోర్ ఫండ్‌ను ఉపయోగించి అదానీ షేర్లు పడిపోవడం వల్ల హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ను అనుసరించి లాభాన్ని పొందారని చెప్పారు. 

కోటక్ లేదా మరే ఇతర కోటక్ బోర్డు సభ్యుని గురించి సెబీ ప్రస్తావించకపోవడం..మరోవైపు అదానీ లాంటి పెద్ద వ్యాపార వేత్తను రక్షించడానికి ప్రయత్నించారని హిండెన్‌బర్గ్ ఆరోపించారు.

2023 జనవరిలో బిలియనీర్ గౌతమ్ అదానీ స్థాపించిన పోర్ట్స్ టు పవర్ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఒక నివేదికను ప్రచురించింది. స్టాక్ ధర్ మానిప్యులేషన్ నుంచి, సంబంధిత లావాదేవీల వరకు అదానీ గ్రూప్ కార్పొరేట్ దుర్వినియోగానికి పాల్పడిందని.. ఇది కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద ఫ్రాడ్ అని తెలిపింది. 

ఈ క్రమంలో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువలో 150 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. తన నివేదికలో పేర్కొన్న సమస్యలపై సమాధానం చెప్పడంలో అదానీ గ్రూప్ విఫలమైందని హిండెన్ బర్గ్ చెప్పారు. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. సెబీ కూడా అటువంటి మోసాలను చేసేవారిపై చర్యలు తీసుకోలేదని.. వారిని రక్షించేందుకు ఆసక్తి కనబరుస్తుందని హెండెన్ బర్గ్ అన్నారు. దీంతో ఈ వివాదం హిండెన్ బర్గ్ సెబీ విచారణ ఎదుర్కొనేలా చేసింది. 

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/zqkrP17
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال

Follow Me