బల్దియాలో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. లేని కార్మికుల పేరిట గత పదేళ్లుగా 200 కోట్ల వేతనాలు మంజూరయ్యాయి. గత పదేళ్లుగా బల్దియా నిధులు పక్కదారి పట్టాయి. పారిశుద్ధ్య కార్మికుల ఫేస్ రికగ్నిషన్‌తో బోగస్ కార్మికులను అధికారులు గుర్తించారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్‌లో (GHMC) భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. లేని కార్మికుల పేరిట గత పదేళ్లుగా రూ. 200 కోట్ల వేతనాలు మంజూరయ్యాయి. గత పదేళ్లుగా బల్దియా నిధులు పక్కదారి పట్టాయి. పారిశుద్ధ్య కార్మికుల ఫేస్ రికగ్నిషన్‌తో బోగస్ కార్మికులను అధికారులు గుర్తించారు. తాజాగా జీహెచ్ఎంసీలో 1570 మంది బోగస్ కార్మికులున్నట్టుగా అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలోనూ 20% విధులకు దూరంగా ఉన్నారు.
గ్రేటర్‌లో మొత్తం 18,557 మంది పారిశుద్ధ్య కార్మికులు డ్యూటీ చేస్తున్నారు. ఇటీవల 16,987 మంది కార్మికులు ఫేస్ రికగ్నిషన్ చేసుకున్నారు. అయితే.. నిత్యం విధులకు హాజరవుతున్న వారు12వేల మంది లోపే కావడం గమనార్హం. సింథటిక్ వేలిముద్రలతో మరణించిన కార్మికులకు పేరుతో ఎస్ఎఫ్ఏలు జీతాలు తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఫేస్ రికగ్నేషన్‌తో వాస్తవాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ప్రతి నెలా జీహెచ్ఎంసీకి రూ.2.5 కోట్ల మిగులుతోంది.