Drugs: బహదూర్‌పురలో డ్రగ్స్ అమ్ముతున్న ఐదుగురి అరెస్ట్
బహదూర్‌పుర(Bahadurpura)లో డ్రగ్స్ అమ్ముతున్న ఐదుగురిని యాంటి నార్కోటిక్ బ్యూరో పోలీసులు(Anti Narcotics Bureau police) అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4లక్షల విలువైన 34గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: బహదూర్‌పుర(Bahadurpura)లో డ్రగ్స్ అమ్ముతున్న ఐదుగురిని యాంటి నార్కోటిక్ బ్యూరో పోలీసులు(Anti Narcotics Bureau police) అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4లక్షల విలువైన 34గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరులో తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు సయ్యద్ ఫైజల్‌పై గతంలోనూ డ్రగ్స్ కేసులు ఉన్నట్లు గుర్తించారు.
జైలు నుంచి వచ్చిన తర్వాతా అతను భార్య మస్రత్ ఉన్నిసా బేగం, స్నేహితులతో కలిసి మళ్లీ డ్రగ్స్ దందా మెుదలుపెట్టాడు. బెంగళూరు నుంచి తక్కువ ధరకు తెచ్చి నగరంలో ఎక్కువ ధరకు అమ్మడమే వృత్తిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వీరి వద్ద కొనుగోలు చేసిన 19మంది కస్టమర్లను గుర్తించినట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు తెలిపారు. ఇటీవల బెంగళూరు శివారులో రేవ్ పార్టీ కేసు అనంతరం నగర పోలీసులు డ్రగ్స్ ముఠాలపై కొరడా ఝుళిపిస్తున్నారు.