పడి లేచిన కెరటం బండి సంజయ్... ఇక ఆపేది ఎవరు

 ఆర్ఎస్ఎస్ నుంచి.. కేంద్ర మంత్రి వరకు.. 'బండి' ప్రయాణం సాగిందిలా



మోదీ జూన్ 9న మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో 50 మందికిపైగా మంత్రులతో కూడిన జంబో కేబినెట్ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనుంది. అయితే తెలంగాణ నుంచి ఇద్దరికి మంత్రి పదవి వరించగా అందులో ఒకరు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఆర్ఎస్ఎస్‌లో స్వయం సేవకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం కేంద్ర మంత్రి వరకు సాగింది. ఆయన జీవిత విశేషాలేంటో తెలుసుకుందాం.



బీజేపీ జాతీయ కార్యాలయం, ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇంఛార్జిగా భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌ గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు. అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జ్‌గా, కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేటర్ గా, రెండోసారి అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ సాధించారు.


రెండు సార్లు కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడిగా..


2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసి 52 వేల పైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.


2019 ఎన్నికల్లో తిరిగి కరీంనగర్ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసి 66,009 ఓట్లను పొంది రెండవ స్థానంలో ఉండగా, రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో నిలిచారు.


2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి, బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి 96వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు.


2019లో ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్‌గా నియామకం


2019లో టొబాకో బోర్డు మెంబర్‌గా నియామకం.


2019లో మైనారిటీ అఫైర్స్ స్టేట్ లెవెల్ కమిటీ మెంబర్‌గా


2019లో అర్బన్ డెవలప్‌మెంట్‌ పార్లమెంట్ కమిటీ మెంబర్‌


2020లో ఎయిమ్స్ బీబీనగర్ బోర్డు మెంబర్‌గా నియామకం


2020లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం


2023లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం


2023 అసెంబ్లీ ఎన్నికల్లో 89 వేల ఓట్లు సాధించారు


2024లో జాతీయ కిసాన్ మోర్చా ఇంఛార్జ్‌గా నియామకం


2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ ఎంపీగా 2 లక్షల 25 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow