వృద్ధురాలి వద్ద బంగారం దొంగతనం*

 *


*సీసీ కెమెరాల్లో రికార్డైన మహిళా దొంగల దృశ్యం* 


బాలానగర్ మండలం సూరారంకు చెందిన వృద్ధురాలు...


మనవరాలి కార్యక్రమంలో బంగారం పెడుదామని ఆశించిన అవ్వకు నిరాశ ఎదురయింది. కొందరు మహిళా దొంగలు వృద్ధురాలిని అనుసరించి బంగారాన్ని నొక్కేశారు. బ్యాగులో పెట్టుకొన్న బంగారం లేడీస్ కార్నర్ కు వెళితే ఇద్దరు మహిళలు వెంబడించి దొంగలించారు.


 షాద్ నగర్ పట్టణంలొని మహాదేవ్ లేడీస్ కార్నర్లో శనివారం బాలానగర్ మండలం సూరారం గ్రామానికి చెందిన చక్కెర భారతమ్మ అనే మహిళా తన కూతురు, మనవరాలు ఫంక్షన్ కు కొన్న ఒక తులం బంగారం తన బ్యాగులో పెట్టుకొని షాపింగ్ చేస్తుండంగా ఎప్పటినుంచో ఈమెను వెంబడిస్తూ ఇద్దరు మహిళలు లేడీస్ కార్నర్ షాప్ లోకి వెళ్లి చకచక్యంగా తమ చేతివాటం ప్రదర్శించారు. బ్యాగులో ఉన్న తులం బంగారం వస్తువు దొంగలించారు. తరువాత తేరుకొన్న మహిళా బ్యాగులో చూస్తే బంగారం దొంగలించబడిందని గ్రహించి స్ధానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. 


ఇద్దరు మహిళలు వెంబడించినట్టు చేసినట్టు సీసీ కెమెరాల్లో కొన్ని దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఇద్దరు మహిళలు అనుమానితులుగా ఉన్నారు. ఎంతో కష్టపడి కూడగట్టుకున్న డబ్బుతో మానవరాలికి బంగారం పెడదామనుకుంటే ఇలా జరిగిందని తనకు న్యాయం చేయాలనీ సదరు మహిళా భారతమ్మ పోలీసులను వేడుకుంటున్నారు.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow