రంగారెడ్డి గూడ గ్రామ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతి చెందిన వాసి..రాజాపూర్ మండలం కుచ్చర్ కల్ గ్రామానికి చెందిన యాదయ్యగా గుర్తించారు.
బాలానగర్ వైపు నుండి రాజాపూర్ వైపు వస్తున్న ఆయన ద్విచక్ర వాహనాన్ని ఓ లారీ ఢీకొంది.
ఈ ప్రమాదంలో యాదయ్యకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాద స్థలాన్ని స్థానిక పోలీసులు సందర్శించి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.
Tags
News@jcl