జోరుగా ఇసుక దందా

 

గద్వాల మండలంలో పీడీఎస్‌ రైస్‌ అక్రమ రవాణా జరుగుతుండగా.. మరోపక్క జోరుగా ఫిల్టర్‌ ఇసుక దందా నడుస్తోంది. ఈ మండలం అక్రమాలకు నిలయంగా మారుతోంది. మండలంలోని గోనుపాడు, సంగాల గ్రామాలలో మట్టి, ఇసుక దందా చేసేవారు చాలా మంది ఉన్నారు. ఈ గ్రామాల పరిధిలో 99వ ప్యాకేజీ కాలువ ఉండటంతో మట్టి సులభంగా లభిస్తోంది. అదేవిధంగా నెట్టంపాడు ప్రాజెక్టులో భాగమైన సంగాల రిజర్వాయర్‌ కూడ ఇక్కడే ఉంది. దాని కింద ఉన్న వాగు సంగాల గ్రామం మీదుగా సంగాల చెరువుకు చేరుతుంది. అక్కడ నుంచే ఫిల్టర్‌ ఇసుక దందా నడుస్తోంది.

తుంగభద్ర నది నుంచి మన ఇసుక వాహనంతో ప్రభుత్వమే ఇసుకను తరలిస్తున్నది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటం, తుంగభద్రలోకి కొద్దిగా నీటి ప్రవాహం రావడంతో మన ఇసుక వాహనాలు చాలా తగ్గిపోయాయి. దీంతో గద్వాలలో ఇసుక కొరత ఏర్పడింది. టీఎస్‌ఎండీసీ

ద్వార ప్రభుత్వ పనులకే అనుమ

తులు ఇస్తుండటంతో ఇళ్ల నిర్మాణాలకు ఇసుక లభించక డిమాండ్‌ పెరిగింది. ఇసుకను ఫిల్టర్‌ చేసే ముఠాకు వరంగా మారింది. దానికితోడు ఈ ఏడాది సంగాల రిజర్వాయర్‌ పూర్తి ఒట్టిపోయింది. దీంతో చాలా ఇసుక బయటపడింది. అందులో కొంతమేర మట్టి శాతం ఉండటంతో దానిని ఫిల్టర్‌ చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు

మండలం మీదుగా పీడీఎస్‌ రైస్‌ రాయిచూర్‌కు రవాణా అవుతున్నది, సంగాల, గోనుపాడు గ్రామాల నుంచి ఫిల్టర్‌ ఇసుక, మట్టి రవాణా అవుతున్నది. వీటిని నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తు న్నారు. అదేవిదంగా పోలీస్‌ పెట్రోలింగ్‌ వ్యవస్థ కూడ సక్రమంగా పనిచేయడం లేదు. గద్వాల మండలం నుంచి వెళ్లిన పీడీఎస్‌ రైస్‌ కేటీదొడ్డి పోలీసులకు పట్టుబడుతున్నాయి.. కానీ గద్వాల పోలీసులకు దొరకడం లేదం టే ఏదో జరుగుతోందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow