ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి "తగ్గేదెలే"
షాద్ నగర్ చౌరస్తాలో హీరో అల్లు అర్జున్ మాదిరి మేనరిజం
రాజకీయ ప్రత్యర్థులకు తగ్గేదేలే అంటూ సవాల్
తగ్గేదేలే అనే డైలాగ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్.. ఈ మధ్యకాలంలో ప్రముఖ క్రికెటర్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఎంతోమంది తగ్గేదేలే అంటూ తమ జోష్ ప్రదర్శిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్. నవీన్ కుమార్ రెడ్డి గురువారం బీఆర్ఎస్ ర్యాలీ ప్రదర్శనలో హీరో అల్లు అర్జున్ మేనరిజం ప్రదర్శించారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన తన సొంత నియోజకవర్గం షాద్ నగర్ పట్టణ కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు భారీ గజమాల ఏర్పాటు చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వీరాభిమాని గుట్ట రాజు ఎమ్మెల్సీని ఘనంగా శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి "తగ్గేదేలే" అంటూ సిగ్నల్ ఇచ్చారు. రాజకీయంగా నవీన్ రెడ్డి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అనేక కేసులు ఆయనపై రాజకీయంగా నమోదై ఉన్నాయి. రాజకీయాల్లో పట్టుదలగా ఒక్కో మెట్టు పైకెక్కారు. పంతాలు, పట్టింపులు, పట్టుదలలు ఆయనకు సాధారణమే.. ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా అనతికాలంలో పదవి సంపాదించారు. మరోవైపు భారత రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్, కేటీఆర్ తదితర నాయకులకు పాలమూరు జిల్లాలో నవీన్ రెడ్డి ఎంతో దగ్గర అయ్యారు. అనతి కాలంలోనే బిఆర్ఎస్ పార్టీలో రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకుని సంచలన నాయకుడిగా నవీన్ రెడ్డి మారారు. ఎవరు ఊహించని విధంగా అతి తక్కువ కాలంలో ఎమ్మెల్సీగా నిలదొక్కుకోవడం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి ఎంతో పెద్ద పదవి సంపాదించడంతో రాజకీయ విమర్శకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ రెడ్డి ప్రదర్శిస్తున్న జోష్ అందులో తగ్గేదేలే అంటూ తన రాజకీయ శత్రువులకు చాలెంజ్ విసిరాడా? అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.