IND vs PAK T20 WC Result: బుమ్రా, అర్షదీప్‌ల ఊచకోత.. ఉత్కంఠ మ్యాచ్‌లో రోహిత్ సేనదే విజయం..
India vs Pakistan, T20 world Cup 2024:టీ-20 ప్రపంచకప్‌లో 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్థాన్‌ను భారత్ అనుమతించలేదు. చివరి ఓవర్‌లో 18 పరుగులు అవసరం కాగా, ఈ ఓవర్‌లో అర్ష్‌దీప్ 11 పరుగులు ఇచ్చాడు. పాకిస్థాన్‌పై భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Modi Cabinet 2024: ఆవిష్కృతమైన చారిత్రక ఘట్టం.. 72 మందితో కొలువుదీరిన నమో 3.O సర్కార్.. అన్నీ విశేషాలే..
Modi cabinet list: చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 3వ సారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణం చేసి.. నెహ్రూ రికార్డును సమం చేశారు. హ్యాట్రిక్ విజయాలతో NDA కూటమిని అధికారంలోకి తీసుకువచ్చిన మోదీ.. ముచ్చటగా 3వ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తరలి వచ్చిన విదేశీ అతిథులు, వీవీఐపీలు, సెలబ్రిటీలు, వేలాది మంది ప్రజల సమక్షంలో రాష్ట్రపతిభవన్‌లో కన్నులపండువగా ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.
72 మంది మంత్రులతో కొలువుదీరిన మోదీ 3.O సర్కార్
ఈసారి మోదీ కేబినెట్‌లో 72 మంది ఉన్నారు. వీరిలో కేబినెట్ ర్యాంక్ 30 మంది ఉంటే, సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) ఐదుగురు, సహాయ మంత్రులుగా 36 మంది ప్రమాణం చేశారు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో 43 మందికి 3 సార్లు కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.. 39 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది..
విపక్షాలకు 11 మంత్రి పదవులు
మోదీ 3.0 కేబినెట్ లో భారత్ నలుమూలల నుంచి.. 24 రాష్ట్రాలు.. అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకున్నారు. మొత్తంగా మిత్రపక్షాలకు 11 కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.
యువ దంపతుల ఆత్మహత్య
ల్మూరు, జూన్ 9 : ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువ జంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూరు మండలంలోని జిన్‌కుంటలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఏఎస్‌ఐ రేణయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నుకుంట గ్రామానికి చెందిన మహేశ్(20), అదే గ్రామానికి చెందిన భానుమతి(18) ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు నిరాకరించారు. దీంతో పెద్దలను ఎదిరించి ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. గ్రామంలోనే ఉంటూ, కూలి పని చేసుకుంటున్నారు. వ్యవసాయంలో మహేష్ తండ్రికి తోడుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కుటుంబంలో చిన్న గొడవ జరగడంతో దంపతులు ఇద్దరూ మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని తమ పొలానికి వెళ్లి, చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లారాక గ్రామస్థులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. అచ్చంపేట సీఐ రవీందర్, బల్మూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. యువతి తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ రేణయ్య తెలిపారు. తమ కుమార్తెను మహేశ్ వేధిస్తున్నాడని భానుమతి తల్లిదండ్రులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అతడు జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత పెద్దలను ఎదిరించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల వారు రాజీ పడటంతో కేసు కొట్టేసినట్లు తెలిసింది.
Tags
News@jcl