ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్

Caption of Image.

మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ స్కీంతో మెట్రోను ఇబ్బందుల్లో పడేస్తున్నారని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. రాజకీయ లబ్ధి కోసమే కొన్ని పార్టీలు ఇలాంటి స్కీంలు తీసుకొస్తున్నాయని విమర్శించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మోదీ... ఫ్రీ జర్నీ స్కీంతో 50 శాతం మహిళా ప్రయాణికులను మెట్రో  కోల్పోతుందని చెప్పారు ప్రధాని మోదీ. 

మరోవైపు మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ ప్రధానికి ఇష్టం లేదని ఫైర్ అయ్యారు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్. దేశవ్యాప్తంగా మహిళలు ఫ్రీ బస్సు కోరుకుంటుంటే.. ప్రధాని వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రధానితో పాటు ఆయన మంత్రులు ఫ్రీగా విమానాల్లో తిరిగితే తప్పు లేదు కానీ మహిళలకు ఫ్రీ బస్సు సర్వీస్ అందిస్తే మోదీ ఇష్టపడడం లేదన్నారు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్. 

మహిళలకు ఫ్రీ బస్సు స్కీం 4 రాష్ట్రాల్లో విజయవంతంగా అమలౌతోంది. ఢిల్లీ, తమిళనాడు, కర్నాటకతో పాటు మన  రాష్ట్రంలోను మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఉందన్నారు.  NDAలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం చర్చనీయాంశంగా మారిందన్నారు. మహిళలకు ఫ్రీబస్ సర్వీస్ బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ మెట్రోలో రద్దీ తగ్గలేదు. రద్దీకి తగ్గట్లుగా బోగీల సంఖ్య పెంచాలనే డిమాండ్లు పెరుగుతున్నాయన్నారు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్.  

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/ITw1Lbh
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow