సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫార్మ్ ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం లిక్కర్ లోడుతో వెళ్లోన్న వాహనం బోల్తా పడింది.
టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో దాదాపు రూ.3లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంస మయ్యాయి. మద్యం బాటిళ్లు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్కు అంతరాయమేర్పడింది.
ఇదే అదునుగా కొందరు వాహనదారులు మద్యం సీసాలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.
Tags
News@jcl