రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు

 


రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంచిర్యాల, ములుగు, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం ఉంటుందని స్పష్టం చేసింది. ఉదయం ఎండకాసినా, సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుందని అధికారులు పేర్కొన్నారు.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow