సంస్కార్ పాఠశాలలో ఘనంగా ప్రొఫెషన్స్ డే(వృత్తి నిపుణుల) కార్యక్రమం
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోగల సంస్కార్ పాఠశాల నందు నేడు విద్యార్థుని, విద్యార్థులు భవిష్యత్తులో వారు కావాలనుకున్న వృత్తులు కలెక్టర్, డాక్టర్, ఇంజనీర్,ఆర్మీ ఆఫీసర్,పోలీస్,లాయర్,డీఈవో,ఎంఈఓ, టీచర్, వ్యవసాయదారులు, పైలెట్, ఫోటోగ్రాఫర్, సైంటిస్ట్, ప్రొఫెసర్, గార్డినర్, ఫైర్ మాన్,పైలట్ ,డెంటిస్ట్, పారామెడికల్,నర్స్,సర్జన్ వంటి వృత్తులను భవిష్యత్తులో నిర్వహిస్తామని వారు వేషధారణలో చక్కగా వివరించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిల్ప మాట్లాడుతూ ప్రతి విద్యార్థిీ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఉన్నత స్థానానికి ఎదిగేలా చదువుతోపాటు మానసిక దృఢత్వంతో నిత్యం క్రమం తప్పకుండా చదవాలని విద్యార్థులకు హితోపదేశం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం గడ్డం సందీప్,రాధిక, తేజ శ్రీ, కరుణ ,ఆబేదా,భవాని, కిరణ్మయి,వీణాశర్మ,శేఖర్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు..
