Gaami: తెలుగు సినిమాకి గౌరవం.. గామిపై రాములమ్మ ప్రశంసలు

Caption of Image.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak sen) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ గామి. కొత్త దర్శకుడు విద్యాధర్(Vidyadhar) కాగిత తెరకెక్కించిన ఈ సినిమా మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. సరికొత్త కథ, కథనాలతో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటీవ్ టాక్ వచ్చింది. భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కురిపిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.22 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమాపై స్పందించారు సీనియర్ నటి విజయశాంతి. తాజాగా ఆమె గామి సినిమా గురించి మాట్లాడుతూ.. నేనూ కూడా గామి సినిమా గురించి విన్నాను. ఇలాంటి సినిమాలు ఆడాలి. కొత్త కథలు రావాలి. అప్పుడే తెలుగు సినిమా స్టయిల్ మారుతుంది. ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాదు, గౌరవాన్ని తెచ్చాయి. ఇప్పుడు గామి సినిమా గురించి అలా చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలి. అప్పుడే మరిన్ని గొప్ప సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎనీ వే… కంగ్రాట్స్ టు గామి టీమ్.. అని చెప్పుకొచ్చారు విజయశాంతి. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/HxhEg9A
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow