రాజస్థాన్లో కూలిన ఆర్మీచాపర్.. పైలట్ సురక్షితం

Caption of Image.

ఇండియాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్ సీఏ) తేజస్ మంగళవారం (మార్చి12)  మధ్యాహ్నం ప్రమాదవశాత్తు రాజస్థాన్ లోని జైసల్మేర్ దగ్గర కుప్పకూలింది. ఆపరేషన్ శిక్షణలో భాగంగా ఈ ప్రమాదం జరిగింది.

విమానం ట్రైనింగ్ లో ఉండగా జైసల్వేర్ లోని జవహర్ కాలనీ సమీపంలో ఆకస్మాత్తుగా కూలిపోయింది. స్థానికులు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. 

ఈ ప్రమాదాన్ని భారత వైమానిక దళం  ధృవీకరించింది. ఐఏఎఫ్ కు చెందిన ఒక తేజస్ విమానం జైసల్లేర్ వద్దశిక్షణలో ఉండగా కూలిపోయిందని తెలిపింది. పైలట్ సురక్షితంగా ఉన్నాడు అని చెప్పింది. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుకునేందుకు విచారణకు కోర్టు ఆఫ్ ఎంక్వైరీ ఆదేశించింది.  

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/f56qpCF
via IFTTT
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow