ఊధ్ కాలదు పీర్ లేవదు" ఆయన చుట్టూ కోటారిలే..

 "


ఊధ్ కాలదు పీర్ లేవదు" 


ఆయన చుట్టూ కోటారిలే.. 


 కష్టం చెప్పుకుందామని వచ్చినా ఎప్పుడూ వీరి సంతే.. 


 ఆ కార్యాలయం ఎమ్మేల్యేదా..? లేక కోటారి అడ్డానా..? 


 "శంకరన్న" జర చూస్కోవే..! 


ఎమ్మెల్యే శంకరన్న మంచోడే.. ఎలాంటి స్వార్థం లేదు.. పదిమందికి పట్టేడన్నం పెట్టి ఆకలి తీర్చాలనుకునేటోడు.. అభివృద్ధి మీద ఆకాంక్ష ఉన్నోడు.. గరీబోళ్ళను తెగ ప్రేమించేటోడు.. ఆయనను చూస్తే మా కష్టాలు చెప్పుకోవాలి అని ఉంటుంది కానీ ఎప్పుడు వెళ్లినా ఆయన వెంట ఉండే కొంతమంది కొటారిల వల్ల ఎలాంటి కష్టనష్టాలు చెప్పుకోలేకపోతున్నామని అస్తమానం కార్యాలయంలో అదే సంత అంటూ పలువురు ప్రజలు, ఉద్యోగస్తులు తదితరులు వాపోతున్నారు. 


షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయం వద్ద నిత్యం రద్దీ కనిపిస్తుండడం సర్వసాధారణమే.. అయితే ఈ రద్దీలో అంతా 80 శాతం కేవలం పార్టీ కార్యకర్తలు ఇతర నాయకులతో నిండిపోతుందని ప్రజలు అనుకుంటున్నారు. ఎవరు ఏ పనిపై వచ్చినా ఎమ్మెల్యే చుట్టూ కొందరు మోపు అవుతుండడంతో కష్టాలు చెప్పుకుందామని వచ్చిన ప్రజలు.. ఆయన చుట్టూ ఉన్న కొటారిలను చూసి వెను తిరుగుతున్నారు. 


నిఖార్సైన కార్యకర్తలు కూడా తమ మంచి చెడ్డలు చెప్పుకుందామని వెళ్లినా ఇదేసంత ఉండడంతో ఏంటి ఇది అని పెదవి విరుస్తున్నారు. ఎక్కడ చూసినా కొంతమంది మాత్రమే ఆయన చుట్టూ పోగు అవుతుండడంతో ఏం చేయాలో తెలియక చాలామంది కిందిస్థాయి కార్యకర్తల నుండి మధ్య స్థాయి వరకు ఎమ్మెల్యే కరుణాకటాక్షాల కోసం వీక్షించక తప్పడం లేదు. ఎమ్మెల్యేగా శంకర్ గెలిచి దాదాపు మూడు నెలలు అవుతుంది. చాలామంది ఆయనను తమ పనులపై ప్రత్యేకంగా కార్యకర్తలు, ప్రజలు కలిసిన దాఖలాలు తక్కువనే చెప్పాలి. ఏదైనా పనులపై వచ్చిన వాళ్ళు తమ ఆపతి సంపతి చెప్పుకునే వాళ్ళు ఎవరు వస్తున్నా ఎప్పుడు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆయన వెన్నంటే ఉంటున్నారు. ఎమ్మెల్యేతో ఏకాంతంగా మాట్లాడేవారు ప్రజలు చాలామంది ఉంటారు. 


ఇతరుల ముందు బహిర్గతం కావలసిన అవసరం వారికి ఉండదు..


 కానీ లగేరహో మున్నాభాయ్ అన్నట్టు ఎమ్మెల్యే వెంట అస్తమానం కొందరు తీష్ట వేయడంతో ఏం చేయాలో పాలుపోక అటు సామాన్య కార్యకర్త మొదలుకొని సామాన్య ప్రజలు ఇతర వర్గాలు కూడా యాష్ట పడుతున్నాయి. ఇక ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కొందరికి అడ్డాగా మారిందని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అది కూడా ప్రభుత్వ కార్యాలయం అనే విషయం దానిని చాలామంది మరిచిపోతున్నారు. ఎమ్మెల్యేతో పని ఉండి ఆయన ద్వారా కలుసుకోవడానికి అదొక వేదిక. అయితే చాలామంది పని పాట లేని వాళ్ళు కూడా అక్కడ తిష్ట వేయడంతో చాలామంది పెదవి విరుస్తున్నారు. కొందరైతే ఎమ్మెల్యేని అంటిపెట్టుకొని ఉంటుండడం ఇతరులకు కలిసే అవకాశం కూడా కల్పించకుండా చేస్తుండటం చాలామందికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. 


మూడు నెలలకు కూడా ఇదే పరిస్థితి దాపురించి ఉండటంతో పలువురు వీర్లపల్లి శంకర్ ను కలుసుకునేందుకు వెనక ముందు ఆలోచిస్తున్నారు. ఎమ్మెల్యే వెంట ఉన్న సదరు అనుచరులు నాయకుల గణం ఎవరి పనులు వారివి, కానీ అస్తమానం అక్కడే తిష్ట వేసి వచ్చేవాళ్లను పోయే వాళ్లను కొంతమంది తూకం వేస్తున్నట్టు సమాచారం. వీరి వల్ల ఊద్ కాలదు పీరు లేవదు అని మరికొందరు కార్యకర్తలే స్వయంగా అంటున్నారు. 


నిజాలు ఎప్పుడు నిష్టురంగానే ఉంటాయి. ఇంకా అనేక విషయాలు మీడియా దృష్టికి వస్తున్నాయి. కానీ ఒక మాట మాత్రం నిజం. ఎమ్మెల్యే శంకర్ పేదల పక్షపాతి అందరివాడు. అందరికీ సమాన న్యాయం జరగాలని చూసేవారు.. కానీ ఆయన వెంట ఉన్న కొటారి మాత్రం కొంత సావధానంగా నియంత్రణ ఆలోచించకపోతే మాత్రం ఎమ్మెల్యే కూడా అప్రతిష్టపాలు కాక తప్పదు. 


ఎమ్మెల్యేను సాయసాకారాలు అందించి ఆయనను ఎమ్మెల్యే చేసిన వారు 77,817 మంది ఓటర్లు ఉన్నారు. అంటే 40.10% శాతం మంది అన్నమాట. వారి మనోభావాలను గౌరవించడం ప్రజాప్రతినిధి కర్తవ్యం. చెప్పడమే మా ధర్మం వినకపోతే మీ కర్మం.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow