రూపాయికే చీర.. సీన్ చూసి అవాక్కైన షాప్ ఓనర్..

బిజినెస్ సరిగ్గా జరగాలంటే జనాలను ఆకర్షించాలి. 



కొత్త కొత్త ఆఫర్లు ప్రకటించాలి. అందుకే పండుగకు ముందు బిజినెస్ మాల్స్ డిస్కౌంట్లు, బంపరాఫర్లు ప్రకటిస్తుంటాయి. ఫ్రీ పబ్లిసిటీ కోసం ఫ్రీ ఆఫర్లు ఇస్తుంటాయి. ఇలా చేస్తే కస్టమర్స్ ను ఈజీగా తమ షాప్ కు రప్పించుకోవచ్చనుకుంటారు. అయితే.. కొన్ని కొన్ని సార్లు వారు ప్రకటించే ఆఫర్లతో మొదటికే మోసం వస్తుంది. తాజాగా భద్రాచలంలో జరిగిన ఓ ఘటనలో షాపు యజమాని తలపట్టుకున్నాడు. రూపాయికే చీర ఆఫర్ ప్రకటించడంతో షాప్ ముందు మహిళలు గుమిగూడారు. అందినకాడికి అందినట్లు తీసుకెళ్లిపోయారు.



భద్రాచలం అంబేడ్కర్‌ సెంటర్‌లోని ఓ రెడీమేడ్‌ దుకాణం.. రూపాయికే చీర ఇస్తామని ప్రకటించింది. యజమాని వచ్చి దుకాణం తెరిచి లోపలికి వెళ్లే సమయంలో వందలాది మంది మహిళలు దుకాణంలోకి దూసుకెళ్లారు. కొందరు చేతివాటం ప్రదర్శించారు. చేతికి అందినవి అందినట్లు తీసుకెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు షాపు వద్దకు చేరుకుని మహిళలను దుకాణం నుంచి బయటకు పంపేశారు. ప్రస్తుతం భద్రాచలంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow