ఉద్యోగ ప్రకటన*ప్ర భుత్వ ప్రధానాస్పత్రిలోని టి డయాగ్నిస్టిక్ లో ఖాళీగా

 *


         మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలోని టి డయాగ్నిస్టిక్ లో ఖాళీగా ఉన్న ఎండి పాతాలజిస్టు, ల్యాబ్ మేనేజర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ ఒక ప్రకటన లో తెలిపారు.

       ఎండి పాతాలజిస్ట్ పోస్టుకు ఎండి పాతాలజీ ఉత్తీర్ణులై ఉండాలని ,ఐఎంసి, స్టేట్ మెడికల్ కౌన్సిల్లో నమోదు చేసుకుని ఉండాలని, ఈ పోస్ట్ కు ఎంపికైన వారికి నెలకు లక్ష రూపాయల వేతనం ఇవ్వడం జరుగుతుందని, ల్యాబ్ మేనేజర్ పోస్ట్ కు ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలని ,మైక్రో బయాలజీ / బయో కెమిస్ట్రీ సబ్జెక్టు కలిగి ఉండాలని ,వీరికి నెలకు 30 వేల రూపాయల వేతనం ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు.


          ఈ నెల 29 లోగా పై పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ,వచ్చిన దరఖాస్తులన్నింటిని ఈ నెల 31వ తేదీ న పరిశీలించి ఫిబ్రవరి 5న మెరిట్ జాబితాను ప్రదర్శించడం జరుగుతుందని,మెరిట్ జాబితా పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 8న వాటిని సమర్పించుకోవచ్చని, పై పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ఫిబ్రవరి 15న ప్రదర్శించడం జరుగుతుందని ఆయన వివరించారు. దరఖాస్తులు, ఇతర వివరాల కోసం ప్రభుత్వ ప్రధానాస్పత్రి సూపరింటెంట్ కార్యాలయం లో సంప్రదించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Previous Post Next Post

نموذج الاتصال