
ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను కలవడం పై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సాయం కోసమే జగన్, కేసీఆర్ దగ్గరకు వచ్చారని అన్నారు. ఓట్ల కోసమే జగన్, కేసీఆర్ దగ్గరకి వచ్చారని విమర్శించారు. కేసీఆర్ ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించేందుకు ప్రయత్నించి జగన్ విఫలమ్యాయరని చెప్పారు. గురువారం నారాయణ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ రోజు నాగార్జునసాగర్ లో లేని గొడవ సృష్టించి జగన్, కేసీఆర్ కు లాభం చేకూర్చాలని ప్రయత్నించారని ఆరోపించారు.
జగన్‌లో మెదటసారి ఓటమి భయం కన్పిస్తుందని.. అందుకే చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని నారాయణ అన్నారు. ఇంట్లో కుంపటి వ్యాఖ్యలు చేసి.. జగన్ తన ఓటమిని ఒప్పుకున్నారని నారాయణ అన్నారు. తన ఇంట్లో జగనే గొడవ సృష్టించుకుని ఇతరులను నిందిస్తున్నారన్నారు. చెల్లిని, బాబాయ్‌ను దూరం చేసుకున్నారని.. అధికారానికి కూడా దూరమవుతారని జోస్యం చెప్పారు.
పొత్తు పేరుతో చంద్రబాబును బీజేపీ నష్టపరచాలని చూస్తోందని అన్నారు. తమను ప్రశ్నించిన వారిని కేంద్రం 17ఏ పేరుతో బెదిరిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు, జగన్‌ను కూడా 17ఏతో బీజేపీ భయపెట్టిస్తోందని నారాయణ అన్నారు.
from V6 Velugu https://ift.tt/529wbBa
via IFTTT