మొదలైన డబుల్ బెడ్రూంలో తనిఖీలు స్వాగతం పలుకుతున్న ప్రజలు

jayyapal jvs media
1 minute read

 


.


టిఆర్ఎస్ (BRS)ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పంచిన కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికి తిరిగి విచారణకు ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా నేడు మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి సమీపంలో గల కెసిఆర్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తనిఖీ చేయడానికి వచ్చిన మహబూబ్నగర్ అర్బన్ తాసిల్దార్ నాలుగు టీములు కలసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో తనకి నిర్వహించారు.

ఏ ఏ ఇల్లు ఏ లబ్ధిదారునికి వచ్చింది ఆ వచ్చిన లబ్ధిదారుని ఆధారం కుటుంబ వివరాలు ఇల్లు తిరిగి సేకరిస్తున్న ప్రభుత్వ అధికారులు.

కాలనీలో ఉన్న కొందరు మహిళలు విచారణను స్వాగతించారు అలాగే తమకు రవాణా సదుపాయాలు లేవని ఏదైనా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి జీవనోపాధి కల్పించాల్సిందిగా కోరారు అలాగే నిత్యం మేము కూలి పనులకు వెళ్తుంటాము మేము లేని సమయంలో వచ్చే విచారణ చేస్తే కష్టమవుతుంది కనుక మాకు ఒక రోజు ముందు సమాచారం ఇచ్చి లేదు అంటే ఆదివారం రోజు వచ్చి విచారణ చేస్తే మేము వారికి సహకరిస్తామని తెలిపారు.

దివిటిపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబంలో నలుగురం ఉన్నామని ఒక్కరికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇచ్చారు డబుల్ బెడ్ రూమ్ లోకి సంబంధించిన భూములలో మా పొలాలు కోల్పోయిన కూడా మాకు న్యాయం జరగలేదని ఇక్కడ వెయ్యి పైగా ఉన్న ఇండ్లలో సగం ఇండ్లు అక్రమంగా ఉంటున్న వారే ఉన్నారు తగు విచారణ చేసి వారిపైన చర్యలు తీసుకొని నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అన్నారు.

ఈ విచారణను అధికారులు త్వర్టిత గతినపూర్తి చేసి నిజమైన లబ్ధిదారులకు ఇల్లు చేకూరేల చూడాలని ప్రజలు కోరుకుంటున్నా

రు





Tags
Chat