టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల పోస్టుల కోసం
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల పోస్టుల కోసం 600లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు సర్వీస్‌లో ఉన్నవారు సైతం దరఖాస్తు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రొఫెసర్లు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. స్క్రూటిని తరువాత ఫైనల్ లిస్ట్‌ను అధికారులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. చివరి రోజున పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇవాళ లేదా రేపు ఫైనల్ రిపోర్ట్‌ను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. ఈ నెల 12న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Tags
News@jcl