Vizag Steel Plant: కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందా..? విశాఖ స్టీల్ ప్లాంట్ పై నిర్ణయం మారుతుందా..?
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) వ్యవహారం మలో మరుపు తిరిగింది. ప్రస్తుతం జాతీయ స్థాయి రాజకీయల్లో స్టీల్ ప్లాంట్ హైలైట్ అయ్యింది..
ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) బిడ్ వేయాలని నిర్ణయించారు. దీంతో ఏపీ రాజకీయాలు (AP Politics) కూడా హీటెక్కాయి.. బీజేపీ (BJP)ని దెబ్బ తీయడానికి కేసీఆర్ ఎత్తుగడ ఏపీ ప్రభుత్వంపైనా ఒత్తిడి పెంచింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం మధ్య మాటల తూటాలు పేలుతునే ఉన్నాయి. అయితే ఈ వివాదం జాతీయస్థాయిలో కేసీఆర్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది..
ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లోనే ఉన్న.. కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. మొన్నటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణలో వెనుకడుగు వేసే అవకాశమే లేదన్నకేంద్రం.. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం ఆలోచించడం లేదని వ్యాఖ్యనించారు..
Tags
News@jcl.
