బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి.. పది మందికి గాయాలు

బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి.. పది మందికి గాయాలు
ఖమ్మం: వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటుచేసుకుంది. కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆరెస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు బాణాసంచా పేల్చారు. ఈ క్రమంలో తారాజువ్వ పడటంతో సమీపంలోని గుడిసెకు నిప్పు అంటుకుంది. దీంతో గుడిసెలోని గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలవ్వగా.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. అయితే ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు కాళ్లు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow