మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కల్తీ కల్లు తాగి ఆసుపత్రి లో ఉన్న బాధితులను పరామర్శించిన - మున్నూరు రవి

పాలమూరు పట్టణంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న కల్తీ కల్లు, కల్తీ మద్యం విక్రాయాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని మన పాలమూరు అభివృద్ధి ఫోరం అధినేత మున్నూరు రవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కల్తీ ని ప్రోత్సహిస్తున్న కేటుగాళ్లపై దేశ బహిష్కరణ చట్టం ఉపయోగించాలని ఆయన కోరారు. పాలమూరు పట్టణ శివారులో ఉన్న దొడ్డలోనిపల్లి,మోతీనగర్ మరియు కోయనగర్ ఇతర ప్రాంతాల పరిధిలో నివాసం ఉండే రోజు వారి పేద కూలీలు దాదాపు పదిమంది కల్తీ కల్లుబారిన పడి మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను మున్నూరు రవి మరియు అతని టీం వెళ్లి పరామర్శించి వైద్యులతో మరియు బాధితుల కుటుంబ సభ్యుల తో మాట్లాడి వారి పరిస్థితిని వాకబు చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదన గురయ్యారూ మేము రోజు వారి కూలీలలం కూలి చేసుకున్నాక కాసింత కల్లు తాగి ఉండే మాకు కల్తీ కల్లు సరఫరా చేస్తున్న వారిమీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని ,కల్తీ కల్లు వాళ్ళ మా కుటుంబ సభ్యులు మాటలు కూడా మాట్లాడలేని పరిస్థితి లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు .అనంతరం మున్నూరు రవి మాట్లాడుతూ పాలమూరు పట్టణంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న కల్తీకల్లు మరియు కల్తీ మద్యం విక్రాయాలపై జనవరి 6వ తేదీన జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం పాటు వారికీ కల్తీ మద్యం మరియు కల్తీ కల్లు వ్యాపారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లుగా వారు గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో కల్తి విక్రయదారులు రెచ్చిపోతున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి నేరుగా తీసుకుపోతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైత్రి యాదయ్య ముదిరాజ్ ,భాండేకర్ విశ్వనాథ్ రావు ,పటేల్ వెంకటేష్ ,ఆంజనేయ ప్రసాద్ యాదవ్ ,మూసంగి వెంకటేష్ ,కార్దె ఆంజనేయులు ,రాకేష్ పటేల్ ,వివేక్ ,సుభాష్ ,మక్సూద్ ,పాల్ బాబు తదితరులు పాల్గొన్నారు .
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow