తెలంగాణ కుటుంబ పాలనలో అంతా అవినీతే.. కఠిన చర్యలు తప్పవు: మోదీ హెచ్చరిక
కేంద్ర పథకాలకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్న మోదీ
తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమయిందని వ్యాఖ్య
కుటుంబ పాలన తెలంగాణలో అవినీతిని పెంచి పోషిస్తోందని విమర్శ
కుటుంబ పాలనకు చరమగీతం పలుకుదామని పిలుపు
కుటుంబ పాలన ఉన్నచోట అవినీతి మొదలవుతుందన్న మోదీ.
తెలంగాణ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని... అయితే, ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు దూరమవుతున్నాయని విమర్శించారు. కుటుంబ పాలన ఉంటే ఇలాగే జరుగుతుందని చెప్పారు. ప్రతి ప్రాజెక్టులో తమ వారి స్వార్థాన్ని ఇక్కడి పాలకులు చూస్తున్నారంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, రాష్ట్ర అభివృద్ధిని కొందరు అడ్డుకుంటున్నారని, అందుకు అభివృద్ధిలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాలన, ఆ కుటుంబ అవినీతి పెరిగిపోతోందని అన్నారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందని అన్నారు. అవినీతిని అణచివేస్తున్న తనపై పోరాడటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయని చెప్పారు.
తెలంగాణలో కుటుంబ పాలనతో అవినీతిని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. అవినీతిపరులపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజాయతీగా పని చేసేవారు ఈ కుటుంబ పాలకులకు నచ్చడం లేదని విమర్శించారు. తెలంగాణలో ఉన్న కుటుంబ పాలన అన్ని వ్యవస్థలు తన గుప్పిట్లో ఉండాలని భావిస్తోందని మండిపడ్డారు. అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఎక్కడైతే కుటుంబ పాలన ఉంటుందో అక్కడ అవినీతి మొదలవుతుందని చెప్పారు. విచారణ సంస్థలను కూడా బెదిరించే స్థాయికి కుటుంబ పాలకులు వచ్చారని మండిపడ్డారు. కుటుంబ పాలనకు చరమగీతం పలుకుదామని పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాలకు రెండు వందే భారత్ రైళ్లు: కిషన్ రెడ్డి.
పరేడ్ గ్రౌండ్స్ సభలో ప్రారంభోపన్యాసం చేసిన కేంద్ర మంత్రి
తెలంగాణ ప్రజల తరఫున ప్రధానికి స్వాగతం పలికిన కిషన్ రెడ్డి
రూ.714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరించనున్నట్లు వెల్లడి
Kishan Reddy: అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి...
హైదరాబాద్: ప్రతి కుటుంబం వెంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) దర్శనం కోరుకుంటుందని, శ్రీవారి భక్తుల కోసమే వందేభారత్ రైలు (Vande Bharat Train)ను ప్రధాని మోదీ (PM Modi) ప్రారంభించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్ (Parade Ground)లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును(Vande Bharat Express train between Secunderabad and Tirupati) ప్రారంభించారన్నారు. దేశంలో 14వ వందేభారత్ రైలును ప్రారంభించుకున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతోందన్నారు.
రూ.7864 కోట్లతో జాతీయ రహదారుల పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం జరుగుతోందని, ఎలాంటి భేదభావాలు లేకుండా ప్రధాని అభివృద్ధి చేస్తున్నారన్నారు. రూ.1,350 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్‌లో కొత్త భవనం నిర్మాణం చేస్తున్నామని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేది ప్రధాని మోదీ సంకల్పమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
కాగా తెలంగాణలో ప్రధాని మోదీ రూ.11,300 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.720 కోట్లతో అభివృద్ధి పనులు.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, జంటనగరాల్లో 13 ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లను ప్రారంభించారు. అలాగే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో వేదికపై నుంచే పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. రిమోట్ ద్వారా శిలాఫలకాలను ఆవిష్కరించారు. రూ.1,350 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు. రూ.7,850 కోట్లతో చేపట్టనున్న జాతీయ రహదారుల పనులు, ఐదు జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మరి కాసేపట్లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.
Tags
News@jcl.
