డిజిటల్ విధానంలో తొలి జనగణన – కుల గణనకు ప్రాధాన్యం మే 10 వరకు స్వచ్ఛందంగా వివరాల నమోదు
- “జనగణన స్టార్ట్ అయ్యింది!”
- “మీరు మీరే డేటా ఎంటర్ చేయాలి!”
- “కుల గణన కూడా ఈసారి!”
- “April 26 నుంచి కొత్త సిస్టమ్!” హైదరాబాద్‌లో పెద్ద అప్డేట్ బాస్!
జనగణన-2027 ప్రక్రియలో భాగంగా తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ స్టార్ట్ అవుతోంది.ఈసారి స్పెషల్ ఏమిటంటే:
👉 తెలంగాణ ఏర్పడ్డాక మొదటి జనగణన
👉 ఫస్ట్ టైం ఫుల్ డిజిటల్ సిస్టమ్
👉 స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి కుల గణన ప్రజలు తామే తమ వివరాలు ఆన్‌లైన్‌లో ఇవ్వొచ్చు.ఇది కంపల్సరీ కాదు కానీ ఓప్షన్ ఇచ్చారు.
మే 11 నుంచి ఎన్యుమరేటర్లు ఇళ్లకు వచ్చి డేటా వెరిఫై చేస్తారు.
2027 ఫిబ్రవరి నుంచి రెండో దశలో వ్యక్తిగత వివరాలు కలెక్ట్ చేస్తారు.హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణలో జనగణన-2027 ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతీ హాళికెరి వెల్లడించారు.
హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె, ఈసారి జనగణన ప్రత్యేకతలను వివరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి జనగణన ఇదేనని తెలిపారు. అలాగే డిజిటల్ విధానంలో జరుగుతున్న మొదటి జనగణనగా కూడా ఇది నిలవనుందని చెప్పారు. ఈ సారి స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి కుల గణన నిర్వహించనుండటం ప్రత్యేకమని పేర్కొన్నారు. ప్రజలు నేరుగా పాల్గొనేలా సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
ప్రజలు అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా స్వచ్ఛందంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని, ఇది తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిని జనగణన పరిధిలోకి తీసుకుంటామని, ఆస్పత్రులు, పాఠశాలలు, దేవాలయాలు, గుడిసెలు, అద్దె భవనాలు అన్నీ లెక్కలోకి వస్తాయని తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ఇళ్లకు వెళ్లి భవనాల గుర్తింపు ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రతి భవనంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో నమోదు చేస్తారు.
తదుపరి దశగా 2027 ఫిబ్రవరి నుంచి వ్యక్తిగత వివరాల సేకరణ చేపడతామని ఆమె వివరించారు.