బీజేపీలో చాలా మంది మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లే.. కేటీఆర్ సంచలన ట్వీట్!!

బీజేపీలో చాలా మంది మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లే.. కేటీఆర్ సంచలన ట్వీట్
హైదరాబాద్: బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఆ పార్టీలో అనేకమంది మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు ఉన్నారని యెద్దేవా చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు ఎంపీలవి కూడా పేక్ సర్టిఫికెట్లే అన్న ఆరోపణలు వస్తున్నాయని గుర్తుచేశారు. అవి రాజస్థాన్, తమిళనాడు యూనివర్సిటీల నుంచి సంపాదించినట్లు తెలుస్తోందన్నారు. ఇది నేరం కాదా?... అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఎలక్షన్ అఫిడవిట్‌ లో తప్పుడు సర్టిఫికెట్లు పొంది గెలవడం నేరమే కదా అని అన్నారు. దీని ఆధారంగా ఆ ఇద్దరు ఎంపీలను ఎందుకు డిస్కాలిఫై చేయరని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్‌‌పై.. అలాగే కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆ రెండింటిని కూడా కోడ్ చేసే విధంగా మంత్రి కేటీఆర్ ఈరోజు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. బీజేపీపై మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్ రాజకీయ సర్కిల్‌లో తీవ్రమైన చర్చకు దారి తీసింది.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow