ఆదరించి అన్నం పెట్టిన పార్టీపై విమర్శలు చేయడం తగదు
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి
మాజీమంత్రి జూపల్లి, మాజీ ఎంపీ పొంగులేటి విమర్శలు అర్ధరహితమని మండిపాటు
బాలానగర్
తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమంపై నిరంతరం కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, అధిష్టానంపై అర్థరహితమైన ఆరోపణలు చేయడం ఏమాత్రం తగదని మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షులు, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి హెచ్చరించారు. సోమవారం ఈ మేరకు బాలనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, పారిశ్రామిక తదితర రంగాలలో సంపూర్ణ అభివృద్ధి సాధిస్తుందన్న విషయాన్ని గమనించాలని సూచించారు. దేశంలోని పక్క రాష్ట్రాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఒకసారి పోల్చి చూడాలని ఆయన హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల వలన తాగు, సాగునీటి రంగాలలో నీటి కొరత లేకుండా చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల ఎకరాలు వివిధ రకాల పంటలు సాగు చేయడం జరిగిందని, అందులో 50 లక్షల ఎకరాలు కేవలం ప్రధాన ఆహార పంటైన వరి సాగు చేసిన విషయం గమనించాలని సూచించారు. జూపల్లి వ్యవహారం మరింత విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇద్దరికీ ఒకేసారి మంత్రి పదవులు వచ్చాయన్న విషయం గుర్తించాలన్నారు. గత ఎన్నికల్లో జూపల్లి ఓటమి పాలు కావడంతో ఆయన తిరిగి మంత్రి కాలేకపోయారని, అయినప్పటికీ వాటి అధిష్టానం గుర్తించి గౌరవించి కొల్లాపూర్ పర్యటనకు వచ్చినప్పుడు కేటీఆర్ స్వయంగా జూపల్లి ఇంటికి వెళ్లి ఆయనకు భరోసాని ఇచ్చారని గుర్తు చేశారు. జూపల్లి అసమ్మతి నాయకులతో కుమ్ముకై ఆదరించి అన్నం పెట్టిన పార్టీపై విమర్శలు చేయడం తగదని, ఇకముందు విమర్శలు చేసే ముందు ఆలోచన చేయాలని సూచించారు. రాజకీయాలలో ఓపిక, సహనం ఉండాలని పదవులు వస్తుంటాయి, పోతుంటాయనీ, అనవసరంగా టిఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించడం మానుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హితవుపలికారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ వెంకటాచారి, రైతుబంధు చైర్మన్ గోపాల్ రెడ్డి, పార్టీ సీనియర్ పార్టీ సీనియర్ నాయకులు జగన్ నాయక్, పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, ఎంపీటీసీ ప్రదీప్ గౌడ్, గుడిసె బాలయ్య,
సుప్ప ప్రకాష్, మంజు నాయక్, మనోహర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు, యువ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags
News@jcl.
