పాలమూరు పట్టణంలో వీరన్నపేట లో ఉన్న శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి అఖండ జ్యోతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి ,ఆదివారం తెల్లవారుజాము 5 గంటల నుండి ప్రారంభమైన జ్యోతి ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ V శ్రీనివాస్ గౌడ్ ు జ్యోతులను దర్శించుకున్నారు అలాగే తొగుటవీర క్షత్రియ కుల బంధువులకు నా వంతుగా కృషి చేస్తూ ఎప్పుడూ అండగా ఉంటానని తెలియజేశారు, పట్టణ పురవీధుల గుండా జ్యోతి ఉత్సవాలు మేళతాళాలు, ఆటపాటలతో బయలుదేరారు మహిళా కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కోలాట ప్రదర్శనను నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు సంఘ విశ్వనాథ్, నలిగేసి లక్ష్మీనారాయణ, రంగం కురుమూర్తి ,రంగం బాలరాజు, జిల్లా అధ్యక్షులు జల్లు స్వామి, కార్యదర్శి చింత నాగరాజు, సలహా సభ్యులు బాలయ్య చంద్రమౌళి, పాండు బాలరాజు ఆంజనేయులు, బాల్ కిషన్, మరియు యువజన సంఘ సభ్యులు, జిల్లా మొత్తంలో ఉన్న క్షత్రియులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు, అలాగే నిన్న దేవాలయం ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వీరన్నపేట కౌన్సిలర్స్ A అంజయ్య, చిన్న వీరయ్య సారు, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ ఇతరులు పాల్గొన్నారు.
Tags
News@jcl.