హైదరాబాద్ సిటీ, : నగరంలోని పలు ప్రాంతాల్లో 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు (కేడీడబ్ల్యూఎస్‌పీ) ఫేజ్–2లో భాగంగా నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై రిపేర్లు చేపట్టనున్నారు. దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీస్, వాల్వుల మార్పిడితో పాటు స్కవర్ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీని సరిచేయనున్నారు.
సమయం: ఈ పనులు అక్టోబర్ 5 ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 6 సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో లో ప్రెషర్‌తో నీరు సరఫరా అయ్యే అవకాశం ఉందని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు.
ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది:
ఆదిభట్ల
కమ్మగూడ
గుర్రంగూడ
బీఎన్‌రెడ్డి నగర్
వనస్థలిపురం
ఆటోనగర్
అల్కాపురి
బీరప్పగడ్డ
హబ్సిగూడ
రామంతాపూర్
వెంకట్‌రెడ్డి నగర్
ఉప్పల్
నాచారం
హెచ్‌ఎంటీ నగర్
తార్నాక
బౌద్ధనగర్
లాలాపేట్
హస్మత్‌పేట్
ప్రకాశ్‌నగర్
మేకలమండి
భోలక్‌పూర్
పద్మారావునగర్
బేగంపేట్
సౌత్ సెంట్రల్ రైల్వే
ఎంఈఎస్
సికింద్రాబాద్ కంటోన్మెంట్
లాలాగూడ
అడ్డగుట్ట
పట్టిగడ్డ
నల్లగుట్ట
గౌతమ్‌నగర్
ఫిరోజ్‌గూడ
బన్సీలాల్‌పేట్
రాంగోపాల్‌పేట్
సీతాఫల్‌మండి
మెట్టుగూడ
వైశాలీనగర్
మీర్‌పేట్
బడంగ్‌పేట్
ఏఆర్‌సీఐ
బాలాపూర్
మైసారం
బార్కాస్
ఎన్‌పీఏ
శంషాబాద్
మధుబన్
ప్రశాసన్‌నగర్
Tags
Hyderabad