School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్ట్‌లో తెలుగు రాష్ట్రాల్లో భారీగా సెలవులు!


 

School Holidays: చాలా పాఠశాలలు రెండో అలాగే నాలుగో శనివారం రోజున కూడా సెలవు ఇస్తుంటాయి. ఇక కొన్ని రాష్ట్రాల్లో ఈ సెలవులు తక్కువగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక స్కూల్ హాలీడే కాలెండర్ ను..

School Holidays: ఆగస్ట్‌ నెల ప్రారంభమైపోయింది. ఈ నెలలో ఎన్నో ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినది. ఈ ఆగస్ట్‌ నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. సెలవులు అంటేనే ఎగిరిగంతులేసే విద్యార్థుల ఈ నెల ఎంతో కీలకం కానుంది. వరుస సెలవులతో ఎంజాయ్‌ చేయనున్నారు. తల్లిదండ్రులు ఎక్కడైన టూన్‌ ప్లాన్‌ చేసుకున్నట్లయితే ఈ నెల ఎంతో కలిసి రానుంది. మరి ఈ నెలలో ఎన్ని రోజులు విద్యార్థులకు సెలవులు రానున్నాయో చూద్దాం.. ఈ ఆగస్ట్‌ నెలలో అనేక ముఖ్యమైన తేదీలు అలాగే సెలవులు ఉన్నాయి. ఇండిపెండెన్స్ డే, రక్షాబంధన్, ఈద్ ఇల్ మిలాద్ ఈ నెలలోనే ఉంది. వాటితోపాటు వారాంతపు సెలవులు కలుపుకుంటే ఈ సెలవులు భారీగానే ఉండనున్నాయి. అయితే ఆగస్టు నెలలో హాలీడే షెడ్యూల్ రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుందని గుర్తించుకోండి. మొత్తంగా చూస్తే ఆగస్టు నెలలో విద్యార్థులకు 4 నుంచి 7 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. అలాగే రాష్ట్రాన్ని బట్టి మారనున్నాయి.

ఆగస్టులో సెలవుల లిస్టు ఓ సారి చూస్తే ఆగస్టు 2 ఆదివారం రోజున సాధారణంగా ఉండే సెలవే. ఆగస్టు 9 ఆదివారం రోజున సెలవు., ఆగస్టు 15 శనివారం రోజున ఇండిపెండెన్స్ డే సందర్భంగా సెలవు, ఆగస్టు 16 ఆదివారం రోజున వీక్లీ హాలీడే ఉంటుంది. అలాగే ఆగస్టు 23 న ఆదివారం. ఆగస్టు 26 రోజున ఈద్ ఈ మిలాద్ సందర్భంగా అనేక రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇక ఆగస్టు 28 శుక్రవారం రోజున రక్షా బంధన్ అనేక రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది. ఇక చివరగా ఆగస్టు 30 ఆదివారం రోజున సెలవు ఉంటుంది. ఇలా మొత్తంగా 8 రోజులు ఈనెలలో విద్యార్థులకు సెలవులు రానున్నాయి. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow