గవర్నమెంట్ టీచర్..ఫేక్ క్యాస్ట్ తో జాబ్.. సర్టిఫికెట్ ను రద్దు చేసిన మెదక్ జిల్లా కలెక్టర్


  ఓ గవర్నమెంట్ టీచర్  క్యాస్ట్  సర్టిఫికెట్, నాన్  క్రిమిలేయర్  సర్టిఫికెట్​ను రద్దు చేస్తూ మెదక్  కలెక్టర్  ప్రతిమా సింగ్  ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ–-ఈ క్యాస్ట్  సర్టిఫికెట్ తో టీచర్  ఉద్యోగం పొందగా, ఉద్యోగం దక్కని మరో అభ్యర్థి ఫిర్యాదుతో అధికారులు విచారణ చేపట్టి, నివేదికను కలెక్టర్ కు అందజేశారు. 2024 డీఎస్సీలో బీసీ–ఈ కేటగిరీకి 5 ఎస్జీటీ పోస్టులు కేటాయించారు. టేక్మాల్  మండలం తంపులూరు గ్రామానికి చెందిన దూదేకుల సనాబేగం బీసీ–-ఈ క్యాస్ట్  సర్టిఫికెట్, నాన్  క్రిమిలేయర్  ఆధారంగా టీచర్  ఉద్యోగం దక్కించుకొని అదే గ్రామంలోని స్కూల్​లో డ్యూటీ చేస్తున్నారు. 

కాగా, ఆమె బీసీ–-బి(దూదేకుల సామాజిక వర్గం) కాగా, బీసీ–ఈ(షేక్​ సామాజిక వర్గం) తప్పుడు క్యాస్ట్  సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందినట్లు పాపన్నపేట మండలం కొత్త లింగాయపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్  నవాజ్  జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణ అనంతరం సనా బేగం క్యాస్ట్  సర్టిఫికెట్, నాన్  క్రిమిలేయర్  సర్టిఫికెట్  రద్దు చేస్తూ మంగళవారం ఉత్తర్వులుజారీ చేశారు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow