రూ.9 లక్షలు డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆర్‌ఐ

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఆర్‌ఐ!
🚨 హైదరాబాద్‌లో ఏసీబీ దాడులు




హైదరాబాద్‌: లంచం కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సైబర్ మోసం కేసులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు ఓ వ్యక్తిని ఆయన రూ.9 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి నుంచి ఇప్పటికే రూ.5 లక్షలు నగదు తీసుకున్నారు. మిగిలిన రూ.4 లక్షల కోసం బెదిరింపులకు పాల్పడినట్లు ఆయనపై ఫిర్యాదు అందింది. ఈ క్రమంలోనే లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఇంట్లో సోదాలు నిర్వహించారు. రూ.13 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow