పోలీస్ శాఖలో భారీ మార్పులు చేపట్టింది రేవంత్ సర్కార్. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మే 1, 2026 నుండి ఈ బదిలీలు అమల్లోకి వస్తాయని తెలిపింది. శిఖా గోయల్, దేవేంద్ర సింగ్ చౌహన్ వంటి సీనియర్ అధికారులను కీలక శాఖలకు నియమించింది.
బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు వీరే:
శిఖా గోయల్
ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్న శిఖా గోయల్‌ను హోం డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది. అదనంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.
దేవేంద్ర సింగ్ చౌహన్
ప్రస్తుతం ఏడీజీ (పర్సనల్)గా ఉన్న దేవేంద్ర సింగ్ చౌహన్‌ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేసింది. శిఖా గోయల్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
షహ్నవాజ్ ఖాసిం
డ్రగ్స్ కంట్రోల్ డీజీగా ఉన్న షహ్నవాజ్ ఖాసింను మల్టీ జోన్-2 ఐజీపీగా బదిలీ చేసింది. అదనంగా IGP (Personnel) బాధ్యతలు కూడా చేపట్టనున్నారు.
తరుణ్ జోషి
ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న తరుణ్ జోషిని ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా నియమించింది. సుధీర్ బాబు రిటైర్మెంట్ నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.
అవినాష్ మోహంతి
మల్కాజిగిరి కమిషనర్‌గా ఉన్న అవినాష్ మోహంతిని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా మరియు ఎక్సయిజ్ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. అదనంగా ఏసీబీ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.
బి. సుమతి
ప్రస్తుతం ఎస్ఐబీ IGగా ఉన్న సుమతిని మల్కాజిగిరి కమిషనర్‌గా నియమించింది.
కార్తికేయ
ఇంటెలిజెన్స్ IGగా ఉన్న కార్తికేయకు ఎస్ఐబీ IGగా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.