మేము రాగానే హైడ్రాని తీసి చెరువులో వేస్తాం
పొద్దున లేస్తే నా చావును కోరుకుంటున్నారు
జీవన్‌రెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం
జగిత్యాల ప్రజాశీర్వాద సభలో కేసీఆర్
‘బీఆర్‌ఎస్ రావాలె’ నినాదమే ప్రతి పల్లెలో వినిపిస్తోందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
పదేళ్ల మా పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాగున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఇది స్కాంలు, దోపిడీలు, దాడుల సర్కారు.
‘గుండె ధైర్యమున్న నాయకుడు జీవన్‌రెడ్డి. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఆయనను బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నాం’ అని కేసీఆర్ ప్రకటించారు.
– బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
కరీంనగర్, జగిత్యాల సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలను వివరించారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
జీవన్‌రెడ్డికి కండువా కప్పుతున్న కేసీఆర్
ఒక్క కొత్త పథకం లేదు
ప్రభుత్వం కొత్త పథకాలు అమలు చేయడం లేదని, ఉన్న పథకాలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.
మీటర్లపై యుద్ధం
వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టే ప్రయత్నాన్ని వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.గప్పాలు కాదు – పని కావాలి
పాలన అంటే మాటలు కాదు, హామీలు అమలు చేయడమే అని కేసీఆర్ అన్నారు.
ఇన్నాళ్లు అవకాశం ఇచ్చా
ప్రభుత్వానికి సమయం ఇచ్చినా ఫలితం కనిపించలేదని విమర్శించారు.
హైడ్రాపై విమర్శలు
పేదల ఇళ్లు కూల్చడంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు భరోసా కోసం మరో సభ?
సభ పెట్టగానే రైతు భరోసా నిధులు విడుదల చేశారని ఎద్దేవా చేశారు.
20 నెలలు బాధ పడ్డా – జీవన్‌రెడ్డి
కాంగ్రెస్‌లో మానసికంగా ఇబ్బంది పడ్డానని, కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉందని జీవన్‌రెడ్డి అన్నారు.