వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు The 131st Constitutional Amendment Bill was defeated.


 ఉత్కంఠ భరితంగా జరిగిన ఓటింగ్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 278, వ్యతిరేకంగా 211 ఓట్లు పడ్డాయి. మొత్తం ఓటింగ్‌లో 489 మంది పాల్గొన్నారు.

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లులో ముడిపడిన మూడు బిల్లులపై సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం సాయంత్రం ఓటింగ్ జరిగింది. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై ఈ ఓటింగ్‌ జరిగింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఓటింగ్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మూడింట రెండొంతుల మెజారిటీకి అవసరమైన 326 ఓట్లను ఎన్డీయే సాధించలేకపోయింది. బిల్లుకు అనుకూలంగా 278, వ్యతిరేకంగా 211 ఓట్లు పడ్డాయి. మొత్తం ఓటింగ్‌లో 489 మంది పాల్గొన్నారు. కాగా, డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow