వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి


వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదుల మండల కేంద్రం సమీపంలో ఓ ఆటో ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Wanaparthy Road Accident) జరిగింది. ఏదుల మండల కేంద్రం సమీపంలో ఓ ఆటో ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిని వెంకటయ్య (50), సుమిత్ర (42)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వనపర్తి జిల్లా పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానిక ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow