దొంగలను పట్టించిన సీసీ కెమెరాలు




మహిళను బెదిరించి ఆమె దగ్గర ఉన్న బంగారు, నగదును దొంగిలించిన ఇద్దరు దొంగలను పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లుగా మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

భూత్పూరు : మహిళను బెదిరించి ఆమె దగ్గర ఉన్న బంగారు, నగదును దొంగిలించిన ఇద్దరు దొంగలను పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లుగా మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. గురువారం భూత్పూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ రామకృష్ణతో కలిసి డీఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడారు. భూత్పూర్ మండల కేంద్రానికి చెందిన పిచ్చకుంట్ల రాములమ్మ కూరగాయల వ్యాపారం చేస్తుంది. ఇందులో భాగంగా ఆమె ఈ నెల మూడో తేదీన తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో మహబూబ్ నగర్ లో కూరగాయలు తీసుకురావడానికి భూత్పూర్ చౌరస్తాకు వచ్చింది. ఈ సమయంలో ఆటో మహబూబ్ నగర్ వెళ్తుంద‌ని రాములమ్మను ఆటోలో ఎక్కించుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
అమిస్తాపూర్ సాక్షి గణపతి ఆలయం దాటిన తర్వాత ఆటోను టేకు చెట్ల సమీపంలో మహిళ మెడపై ఓ వ్యక్తి కత్తి పెట్టి బెదిరించగా.. డ్రైవర్ ఆటోను నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి ఆ మహిళ దగ్గర ఉన్న బంగారు పూస్తే, 12 బంగారు చిన్న గుండ్లు, రెండు పెద్ద గుండ్లు, చెవి కమ్మలు, 5000 రూపాయల నగదు మొత్తము దాదాపుగా 75 వేల రూపాయల విలువైన వస్తువులను దొంగలించి ఆ మహిళను వదిలేసి దొంగలు అదే ఆటోలో పరారు అయినట్లుగా డీఎస్పీ వివరించారు. రాములమ్మ కుమారుడు పిచ్చకుంట్ల బాలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూత్పూర్ సిఐ రామకృష్ణ పర్యవేక్షణలో ఎస్సై చంద్రశేఖర్, సిబ్బంది వెంకట నాయక్, రాఘవేందర్, నాగరాజు, ఎండి ఇబ్రహీం కలిసి దొంగల ఆచూకీ కోసం చర్యలు ప్రారంభించడం జరిగిందని డిఎస్పీ తెలిపారు. ఆటోకు నెంబర్ ప్లేటు తొలగించి మహిళను ఎక్కించుకుపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు కావడం జరిగిందని ఆయన తెలిపారు,
అమిస్తాపూర్ సాక్షి గణపతి ఆలయం దాటిన తర్వాత ఆటోను టేకు చెట్ల సమీపంలో మహిళ మెడపై ఓ వ్యక్తి కత్తి పెట్టి బెదిరించగా.. డ్రైవర్ ఆటోను నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి ఆ మహిళ దగ్గర ఉన్న బంగారు పూస్తే, 12 బంగారు చిన్న గుండ్లు, రెండు పెద్ద గుండ్లు, చెవి కమ్మలు, 5000 రూపాయల నగదు మొత్తము దాదాపుగా 75 వేల రూపాయల విలువైన వస్తువులను దొంగలించి ఆ మహిళను వదిలేసి దొంగలు అదే ఆటోలో పరారు అయినట్లుగా డీఎస్పీ వివరించారు. రాములమ్మ కుమారుడు పిచ్చకుంట్ల బాలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూత్పూర్ సిఐ రామకృష్ణ పర్యవేక్షణలో ఎస్సై చంద్రశేఖర్, సిబ్బంది వెంకట నాయక్, రాఘవేందర్, నాగరాజు, ఎండి ఇబ్రహీం కలిసి దొంగల ఆచూకీ కోసం చర్యలు ప్రారంభించడం జరిగిందని డిఎస్పీ తెలిపారు. ఆటోకు నెంబర్ ప్లేటు తొలగించి మహిళను ఎక్కించుకుపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు కావడం జరిగిందని ఆయన తెలిపారు
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow