ఒకవైపు ట్రంప్ టారిఫ్స్, మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్త పరిస్థితులతో బంగారం ధరల్లో వస్తున్న మార్పులను క్యాష్ చేసుకుంటున్నా మోసగాళ్లు. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో.. ఇప్పట్లో కొనగలమా? అనే ఆందోళన సామాన్యులలో మొదలైంది. దీన్ని ఆసరాగా చేసుకుని జనాలను భలే తెలివిగా మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. నల్గొండ జిల్లాలో ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ చేసిన కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మోసాలకు పాల్పడుతున్న ముత్తూట్ ప్రైవేట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ అను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి నుంచి 4 లక్షల రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
తాకట్టులొ ఉన్న బంగారం తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ కస్టమర్లను మోసం చేస్తున్నాడు ఈ మాయగాడు. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ రాజశేఖర్ రాజు సబ్ డివిజన్ కార్యాలయంలో వెల్లడించారు. ఇలాంటి మోసగాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేశారు.
తాకట్టులొ ఉన్న బంగారం తక్కువ ధరకే ఇప్పిస్తానని డబ్బులు కలెక్ట్ చేశాడు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ప్రజలను హెచ్చరించారు. ఎవరైనా తక్కువ ధరకే గోల్డ్ ఇప్పిస్తామని ఆశపెడితే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని సూచించారు.
Tags
Hyderabad