పేద, మధ్యతరగతి ప్రజలకు తీపికబురు.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు

 


హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పతనమయ్యాయి.
కొనబోతే కొరివి అన్నట్లుగా పెరిగిన బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ మరోసారి పసిడి, వెండి ధరలు ఊహించని విధంగా పతనమయ్యాయి. ఒకేరోజు వేలల్లో ధరలు తగ్గడం కొనుగోలుదారులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో సామాన్యులకు పెద్ద ఊరటనిస్తోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 బంగారం ధర నేడు ఏకంగా రూ.5,950 తగ్గి, ప్రస్తుతం రూ.1,40,020 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారంపై రూ.5,450 పతనమై, రూ.1,28,350 కు చేరింది. మరోవైపు కేజీ వెండిపై ఏకంగా రూ.20 వేలు తగ్గి, ప్రస్తుతం రూ.2,30,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాల కారణంగానే దేశీయ మార్కెట్‌లో ఈ స్థాయిలో ధరలు తగ్గినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ తగ్గింపుతో నగల దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడే అవకాశం ఉంది.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow