గుడ్‌న్యూస్.. దిగొచ్చిన పసిడి, వెండి ధరలు


దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాల ఉద్రిక్తతలతో కొద్దిరోజుల క్రితం ఈ రేట్లలో స్థిరమైన పెరుగుదల నమోదవ్వగా.. నేడు స్వల్పంగా దిగొచ్చాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 7:00 గంటల సమయంలో బంగారం రేట్లు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధరపై రూ.10 మేర పతనమై రూ.1,62,210కు చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాములపై కూడా అదే స్థాయిలో తగ్గి ప్రస్తుతం రూ.1,48,690 వద్ద ట్రేడవుతోంది(Gold Rates Today).
ఇక వెండి విషయానికొస్తే.. క్రితం రోజుతో పోలిస్తే కిలో వెండిపై రూ.100 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,79,900గా ఉంది(Silver Rates Today).

ప్రధాన నగరాల్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం(10 గ్రాములకు) ధరలు ఇలా..

హైదరాబాద్: ₹1,62,210; ₹1,48,69

విజయవాడ: ₹1,62,210; ₹1,48,690

ఢిల్లీ: ₹1,62,360; ₹1,48,840

ముంబై: ₹1,62,210; ₹1,48,690

కోల్‌కతా: ₹1,62,210; ₹1,48,690

చెన్నై: ₹1,63,300; ₹1,49,690

బెంగళూరు: ₹1,62,210; ₹1,48,690

కేరళం: ₹1,62,210; ₹1,48,690

పుణే: ₹1,62,210; ₹1,48,690

వెండి రేట్లు(కిలోకు) ఇలా..

హైదరాబాద్: ₹2,89,900

విజయవాడ: ₹2,89,900

ఢిల్లీ: ₹2,79,900

ముంబై: ₹2,79,900
కోల్‌కతా: ₹2,79,900
చెన్నై: ₹2,89,900

బెంగళూరు: ₹2,79,900
కేరళం: ₹2,89,900

పుణే: ₹2,79,900

గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే అందించడమైనది. బంగారం ధరలు పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నగరం, మేకర్/జ్యువెలర్ ఆధారంగా రేట్లలో స్వల్ప తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాలని సూచించడమైనది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow