కల్వర్టు నిర్మాణ పనులు.. హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు

Achampet Accident

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పరిధిలోని బొమ్మనపల్లి వెళ్లే ప్రధాన మార్గంలో నక్కమర్రి వాగు దగ్గర చెదురు బావి తండా సమీపంలో కల్వర్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పరిధిలోని బొమ్మనపల్లి వెళ్లే ప్రధాన మార్గంలో నక్కమర్రి వాగు దగ్గర చెదురు బావి తండా సమీపంలో కల్వర్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆ ప్రదేశంలో ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆ రహదారి మార్గంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. ఇటీవల రెండు సార్లు ప్రమాదాలు జరిగాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఆదివారం రాత్రి దాదాపు తొమ్మిది గంటల సమయంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. గుండెమోని బచ్చలయ్య తన భార్యతో ద్విచక్ర వాహనంపై అచ్చంపేట వైపు నుండి బొమ్మనపల్లి కి వెళ్తున్న క్రమంలో రోడ్డు బాగానే ఉందని నేరుగా వెళ్లడంతో ద్విచక్ర వాహనం కల్వర్టు గుంతలో పడి భార్య తలకు బలమైన గాయాలు అయ్యాయి.

అదే సమయంలో అటుగా వెళుతున్న బిసిఎఫ్ స్టేట్ సెక్రటరీ డాక్టర్ నారమోని నరేష్ యాదవ్ వెంటనే స్పందించి 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు కల్వర్టు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సమీప గ్రామాల వారు డిమాండ్ చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow