హైబీమ్ లైట్ల హెచ్చరిక
అరే ఓయ్… నమస్కారం రా బాబూ!
నేను jayapal ni
ఈరోజు టాపిక్ ఏంటంటే…
👉 రాత్రి రోడ్ల మీద హైబీమ్ లైట్లు పెట్టే మహానుభావులు!
అయ్యా మీకు దండం రా…
మీ లైట్ చూసి
మా కళ్ళు ట్యూబ్ లైట్లయ్యాయి!
నిన్న రాత్రి రోడ్డుపై పోతున్నా రా…
పోల్ లైట్లు లైన్‌గా నిల్చున్నాయి…
నేను సాఫ్ట్‌గా పోతుంటే…
అంతలో ఎదురుగా ఒక కారు!
అయ్యో రామా…
హైబీమ్ లైట్…
అది లైట్ కాదు రా బాబూ…
సూర్యుడు డైరెక్ట్‌గా దిగినట్టు ఉంది!
అయ్యా డ్రైవర్ సారు…
నువ్వు హైబీమ్ పెట్టావంటే
నేను నైట్ కాదనుకొని
పగలే అనుకున్నా!
ఒక్క సెకన్‌కు
రోడ్డు కనిపించలేదు…
ముందు బైక్ ఉందా?
పాదచారి ఉన్నాడా?
లేక నా జీవితమే టర్న్ తీసుకుందా?
కొంతమంది ఉంటారు రా…
“నేను హైబీమ్ పెట్టి పోతా…
ఎదుటోడే చూస్కోవాలి” అంటారు…
అరే బాబూ…
నీ లైట్ వల్ల ఎదుటోడికి
చూసే అవకాశం ఉండదు రా!
హీరో అయితివా?
లైట్ పెట్టి కాదు…
జాగ్రత్తగా నడిపితే హీరో అవుతావు!
నవ్వులే నవ్వులు…
కానీ విషయం సీరియస్ రా…
నీ హైబీమ్ వల్ల
ఎదుటోడికి చూపు పోతుంది…
పాదచారి కనిపించడు…
సైకిల్, బైక్ చివరి సెకన్‌లో కనిపిస్తాయి…
అప్పుడే జరిగే ప్రమాదం
న్యూస్‌లో మాత్రమే కాదు…
నిజ జీవితంలో!
అంత కష్టమేమీ లేదు రా బాబూ…
✔ ఎదురుగా వాహనం వస్తే – హైబీమ్ తగ్గించు
✔ రాత్రి స్పీడ్ తగ్గించు
✔ లైట్ కాదు – లైఫ్ ముఖ్యమని గుర్తుపెట్టుకో
నీ స్విచ్‌లో రెండు ఆప్షన్లు ఉన్నాయి…
హైబీమ్ – ప్రమాదం
లో బీమ్ – భద్రత
నువ్వు సేఫ్‌గా ఇంటికి పోతే
నీ ఇంట్లో వాళ్లు నవ్వుతారు…
నీ హైబీమ్ వల్ల
ఎదుటి వాడు ఇంటికి చేరకపోతే…
అతని ఇంట్లో ఎవరు నవ్వరు రా…
కాబట్టి రా బాబూ…
హైబీమ్ తగ్గించు
స్పీడ్ తగ్గించు
అందరం కలిసి బ్రతుకుదాం!
నవ్వుతూ చెప్పినా
విషయం మాత్రం గట్టిగానే తీసుకోండి…
ఈ వీడియోని షేర్ చేయండి రా…
ఒకరి ప్రాణం కాపాడినోళ్లవుతారు!
“అయ్యా లైట్ తగ్గించు!”
“హైబీమ్ = హై డేంజర్”యాలకు అతీతంగా సేవా బాట