బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే పసిడి ధర గ్రాముకు పది రూపాయల మేర తగ్గింది. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం ధర.. గత రెండు వారాలుగా క్రమక్రమంగా దిగి వస్తోంది.
భారత్‌లో బంగారం ధరలు మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్ (MCX), స్థానిక మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి. ఈరోజు (ఫిబ్రవరి 18, 2026) ఉదయం నాటికి 24 క్యారెట్ బంగారం (పూర్తి స్వచ్ఛమైనది) 10 గ్రాములు రూ.1,54,190 (గ్రాముకు రూ.15,419)గా ఉంది. నిన్నటితో పోలిస్తే గ్రాముకు రూ.10 తగ్గింది. 22 క్యారెట్ బంగారం (ఆభరణాలకు సాధారణంగా ఉపయోగించేది) 10 గ్రాములు రూ.1,41,340 (గ్రాముకురూ.14,134) చేరింది. గత రోజుతో పోలిస్తే రూ.10 తగ్గింది. అలాగే 18 క్యారెట్ బంగారం 10 గ్రాములు రూ.1,15,640 (గ్రాముకు రూ.11,564)గా ఉంది.
ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. గత రెండు వారాల్లో 24 క్యారెట్ బంగారం ధర 16 శాతం తగ్గి రూ.1,51,000కి చేరుకుంది. MCXలో ఏప్రిల్ డెలివరీ(బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్) బంగారం ధర రూ.1,52,532కు చేరుకుంది, ఇది 1.44 శాతం తగ్గుదలను సూచిస్తుంది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు అంతర్జాతీయ మార్కెట్లలో భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడం, డాలర్ బలపడటం, సేఫ్-హెవెన్ డిమాండ్ తగ్గడంగా భావిస్తున్నారు. కాగా, హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం కొనుగోలు ఇటీవల తగ్గింది. ధరలు మరింత తగ్గుతాయని కొనుగోలుదారులు ఆశించడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో 22 క్యారెట్ గరిష్ఠ ధర గ్రాముకు రూ.14,700 ఉండగా, కనిష్ఠ రేటు రూ. 13,170కి చేరింది. హైదరాబాద్‌లోని ప్రముఖ మార్కెట్లు లాడ్ బజార్, బేగంపేట్, అబిడ్స్‌లలో ఈ ధరలు అమలులో ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు 10 గ్రాములకు (24 క్యారెట్, 22 క్యారెట్) ఇలా ఉన్నాయి:
హైదరాబాద్: రూ.1,54,190, రూ.1,41,134
విజయవాడ: రూ.1,54,190, రూ.1,41,340
చెన్నై: రూ.1,56,210, రూ.1,43,190
బెంగళూరు: రూ.1,54,190, రూ.1,41,340
కేరళ: రూ.1,54,190, రూ.1,41,340
ముంబై: రూ.1,54,190, రూ.1,41,340
ఢిల్లీ: రూ.1,54,340, రూ.1,41,490