భ్యర్థులు నేరుగా స్థానిక స్మశాన వాటికకు వెళ్లి, అక్కడ ఉన్న సమాధుల వద్ద నిలబడి ఓట్లు వేయమని వేడుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. “ఓ అవ్వా… ఓ తాతా… నేను ఒకటో వార్డుకు అభ్యర్థిగా, 14వ నెంబర్ గుర్తు మీద మున్సిపల్ కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబడ్డాను. మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే… మీరు చచ్చిపోయి ఇప్పటికి ఆరు, ఏడు సంవత్సరాలు అవుతోంది. కానీ ఈ అధికారులు చూడండి… ఇప్పటికీ మీ పేరును ఓటర్ల జాబితాలోనే ఉంచారు.” అని అన్నారు.
ఓటర్ల జాబితా నుండి మృతుల పేర్లను తొలగించడంలో ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైందని వారు ఎండగట్టారు. ఓటర్ల జాబితాలో ఉన్న మృతుల పేర్లను, వారి సమాధులను చూపిస్తూ అధికారులకు కనువిప్పు కలిగేలా ఈ నిరసన చేపట్టారు. వెంటనే ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని, మరణించిన వారి పేర్లను తొలగించి పారదర్శకమైన జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.