మ్యూల్ అకౌంట్లపై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం.. వేల ఖాతాలకి పోలీసుల చెక్


 తెలంగాణ పోలీసులు ఆపరేషన్ క్రాక్‌డౌన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సైబర్ క్రైమ్‌పై 16 జిల్లాల్లో ఒకేసారి ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫోకస్ పెట్టారు.

తెలంగాణ పోలీసులు (Telangana Police) ఆపరేషన్ క్రాక్‌డౌన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సైబర్ క్రైమ్‌పై 16 జిల్లాల్లో ఒకేసారి ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫోకస్ పెట్టారు. 2025లో రాష్ట్రంలో 4,775 మ్యూల్ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈరోజు(బుధవారం) జరిపిన ఆపరేషన్‌లో 1,888 అనుమానాస్పద ఖాతాలకు సైబర్ సెక్యూరిటీ అధికారులు బ్యూరో చెక్ పెట్టారు. ఈ క్రమంలోనే 137 బ్యాంక్ బ్రాంచ్‌ల్లో సోదాలు చేశారు. దేశవ్యాప్తంగా 9,431 క్రైమ్ లింకులు ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలోనే 782 కేసులతో మ్యూల్ అకౌంట్లకు ఈ సంబంధం ఉందని వివరించారు.137 పోలీస్ టీమ్స్ 512 మంది సిబ్బందితో ఈ సోదాలు నిర్వహించారు. కొన్ని బ్రాంచ్‌ల్లో వందల సంఖ్యలో మ్యూల్ ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. సుల్తాన్ బజార్‌లో ఒకే అకౌంట్‌కు 496 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. సూర్యాపేటలో 4 బ్రాంచ్‌లలో 298 అనుమానాస్పద ఖాతాలు, చిన్న బ్యాంకులు RTGS కోసం నేషనల్ బ్యాంకుల సిస్టమ్ వినియోగించినట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. సరైన వెరిఫికేషన్ లేకపోవడంతో సైబర్ నేరగాళ్ల మ్యూల్ అకౌంట్స్‌తో దందాలకు పాల్పడుతున్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు పేర్కొన్నా
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow