సోషల్ మీడియా వేదికగా బ్లాక్ మెయిల్ చేస్తున్న దంపతుల బాగోతాన్ని కరీంనగర్ రూరల్ పోలీసులు బట్టబయలు చేసారు.. భార్యభర్తలు ఇద్దరూ కలిసి వలపు వల వేసి అమాయకులను టార్గెట్ చేసేవారు. ఆ తర్వాత.. నగ్న వీడియోలు బయట పెడుతామంటూ బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు దండుకున్నారు..
అయితే, ఇటీవల కరీంనగర్‌లోని ఓ వ్యక్తి వారి మాయలో పడి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు.. భర్తతో మందు తాగడం.. ఆమెతో శారీరకంగా కలవడం.. ఇలా దాదాపు 15 లక్షల వరకు వారికి ఇచ్చాడు.. అతను ఇచ్చిన దాదాపు 14 లక్షల డబ్బులతో అపార్ట్మెంట్, కారు ఈఎంఐలు కట్టేవారు. అయితే గత కొద్ది రోజులుగా అతడు వారి దగ్గరకు రావడం లేదు.. తన దగ్గర డబ్బులు లేకపోవడం.. అతను రాకపోవడంతో.. దంపతులు అతనికి ఫోన్ చేసి.. ఆరా తీయడం మొదలుపెట్టారు..
తమ దగ్గరకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించగా.. తనదగ్గర డబ్బులు లేవని తనను మర్చిపోవాలని ప్రాథేయపడ్డాడు.. అయినా.. అంతటితో ఆగకుండా.. ఫొటోలు, వీడియోలు ఉన్నాయంటూ.. అతనికి వాట్సప్ కాల్ చేసి బెరిచించడం మొదలుపెట్టారు. డబ్బులు ఇవ్వాలని లేదంటే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని, చంపుతామని బెదిరించగా లక్ష రూపాయలు ఇచ్చాడు. ఇంకా నాలుగు లక్షలు కావాలని బెదిరించగా.. భయంతో.. తన స్నేహితులకి ఈ విషయాన్ని చెప్పాడు.. దీంతో వారిచ్చిన సలహా మేరకు.. పోలీసులను సంప్రదించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకొని జైలుకి పంపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.