Nizamabad: ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా చంపి.. హార్ట్‌ఎటాక్ అని నాటకమాడి



ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను దారుణంగా చంపింది భార్య. తన గుట్టు బయట పడకుండా హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి దొరికిపోయింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. 

 నిజామాబాద్ జిల్లా, జనవరి 5:మక్లూర్ మండలం బొర్గాం‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియుడి(Lover) మోజులో పడి భార్య(Wife) కట్టుకున్న భర్త (Husband)ను నిర్దాక్షిణ్యంగా ఉరేసి చంపింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పట్టాటి రమేశ్ (35) భార్య సౌమ్య ఓ ప్రైవేట్‌ స్కూల్లో(private school) ఉద్యోగం చేస్తుంది. అదే స్కూల్‌లో పీఈటీ (PET)గా పనిచేస్తున్న దిలీప్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భర్త రమేశ్ కి తెలియడంతో ఇద్దరికీ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే తన భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది సౌమ్య. గత నెల 20న తన ప్రియుడు దిలీప్‌తో కలిసి రమేష్‌ని ఇంట్లోనే టవల్‌తో ఉరేసి హత్య చేసింది. అనంతరం ఏమీ తెలియనట్లుగా తన భర్త గుండెపోటుతో చనిపోయాడని బోరున విలపిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా అందరినీ నమ్మించి హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేసింది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow