Medaram: ‘కాదేది వ్యాపారానికి అనర్హం’.. మేడారంలో చిత్రవిచిత్ర దందాలు


 

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

మేడారం (Medaram) సమ్మక్క–సారలమ్మ మహాజాతర (Sammakka-Saarakka Maha Jathara)కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలకు కూడా అమ్మవార్లను దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా మేడారానికి తండోపతండాలుగా వస్తున్నారు. అయితే, కొబ్బరికాయలు, బెల్లం (బంగారం), పూజా సామగ్రి అమ్మకాలకు ఇప్పటికే అధికారులు టెండర్లు వేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు.

కానీ, భక్తుల అవసరాలను ఆసరగా చేసుకుని చిత్రవిచిత్ర దందాలు తెరపైకి వస్తున్నాయి. పండుగ వాతావరణంతో పాటు చలి తీవ్రత కూడా అధికంగా ఉండటంతో భక్తులు జంపన్న వాగులో స్నానాలు చేసేందుకు జంకుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యక్తులు జంపన్న వాగు సమీపంలో వేడి నీళ్ల విక్రయానికి తెర లేపారు. ఒక్కో బకెట్ వేడి నీటికి రూ.50 చొప్పున వసూలు చేస్తూ రూ.వేలల్లో దండుకుంటున్నారు. చలిలో జంపన్న వాగులో స్నానం చేయలేక తప్పనిసరి పరిస్థితుల్లో వేడి నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. ఇలా కొందరు రోజుకు వందల బకెట్ల వేడి నీటిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చిత్రం చూసిన జనం ‘కాదేది వ్యాపారానికి అనర్హం’ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow